calender_icon.png 11 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేదు

11-11-2025 02:09:03 AM

‘భరోసా’ బాధితులకు భరోసా కల్పిస్తాం

డీజీపీ శివధర్‌రెడ్డి, సీపీ సుధీర్‌బాబు 

రాచకొండ కమిషనరేట్ మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన

సరూర్‌నగర్‌లో భరోసా సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

ఎల్బీనగర్/మేడిపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు లేవని, బాధితులకు భరోసా కల్పిస్తామని, నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని డీజీపీ శివధర్‌రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్ ప్రాంగ ణంలో సిటీ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని (ఉమెన్ సేఫ్టీ వింగ్)ను ప్రారంభించారు.

దివిస్ లేబరేటరీస్ లిమిటెడ్ చైర్మన్ మురళీకృష్ణ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా సుమారు రూ.4 కోట్లతో ద్వారా సిటీ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడు తూ.. రోడ్డు సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు, సైబర్ నేరాలను, అదుపు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పోలీసులకు అవసరమని అన్నారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నా పూర్తిస్థాయి భవనాలు లేకపోవడం, ట్రైనింగ్ సెంటర్ లేకపోవడం లోపంగానే ఉన్నదని, అది నేటితో తీరుతుంది అన్నారు.

సైబర్ క్రై మ్ నివారణ, రోడ్ సేఫ్టీల ముఖ్య ఉద్దేశంగా సిటీ ట్రైనింగ్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కూడా సిటీ ట్రైనింగ్ సెంటర్ అవసరం ఉందని, త్వరలో అంతట ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహ హింస వంటి అంశాల్లో తక్షణ స్పం దన, సహాయం అందించడం భరోసా సెం టర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంలో, అత్యవసర పరిస్థితుల్లో సమ న్వయం సాధించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల కెమెరాలు కమాండ్ సెంటర్‌తో అనుసంధానమవుతున్నాయని తెలిపా రు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, గృహ హింస, ర్యాగింగ్, దూషణ, ఇతర వేధింపులకు గురైన బాధితులకు భరోసా కేంద్రం ఆసరాగా ఉంటుందని తెలిపారు.

బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టులో కేసు నిలబడే విధంగా చేసేందుకే భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఉమె న్ సేప్టీవింగ్ డీసీపీ ఉషారాణి, టీజీపీఐసీఎస్ ఎండీ ఎం.రమేష్, ఎల్బీనగర్ డీసీపీ బి అనురాధ, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీబీ చక్ర పాణి, అదనపు డీసీపీ, ఉమెన్ సేప్టీవింగ్ ఎస్పీ షైక్ సలీమా, ఏసీపీ పి.వెంకటేశ్వర్లు, ఇన్స్ స్పెక్టర్లు ఎం.ముని, జి.అంజయ్య, సైదిరెడ్డి, సైదులు, ఇతర పోలీసు ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.