11-11-2025 02:09:27 AM
-తరగతి గదులు, టాయిలెట్స్ నిర్మాణం
-పరిపాలనా అనుమతులు జారీ
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మొత్తం రూ. 243 కోట్లతో ఆయా విద్యాలయాల్లో ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి పరిపాలనా అనుమతులను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికో లస్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో కేజీబీవీలను గుర్తిం చి వాటిల్లో అదనపు తరగతి గదులు, బాలికలకు అడిషనల్ టాయిలెట్స్, వాటర్ సంపు లు, బోర్లు, కంపౌండ్ వాల్స్ లాంటి వసతులను ఏర్పాటు చేయనున్నారు. కేజీబీవీల్లో 8009 టాయిలెట్స్, బాత్‌రూములు లేవని గుర్తించారు. వీటిని నిర్మించనున్నారు. కాం పౌండ్ వాల్స్ 93 చోట్ల నిర్మించనున్నారు. ఇప్పటికే 233 కేజీబీవీల్లో సివిల్ పనులు చేపడుతున్నారు.
జిల్లాల్లో ఎంట్రెన్స్ టెస్టులు
కేజీబీవీల్లో అడ్మిషన్లు చేపట్టేందుకు జిల్లా ల్లో ప్రత్యేంగా ఎంట్రెన్స్ టెస్టులను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన చర్యలను అధికారులు చేపడుతున్నారు. వ చ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. అయితే 93 కేజీబీవీ లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)గా అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు ఎప్‌సెట్, జేఈ ఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఇప్పటికే కోచింగ్‌లు ఇప్పిస్తున్నారు.