19-07-2025 01:14:03 AM
బీజేపీ నేతలకు అధిష్ఠానం అల్టిమేటం
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): పార్టీలైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని బీజేపీ కొత్త చీఫ్ రాంచందర్‌రావు పార్టీ నేతలను హెచ్చరించినట్టు తెలుస్తోంది. చాలా మంది పార్టీ నేతలు ఇష్టానుసారంగా మీడియా సమావేశాలు నిర్వహించడం, పార్టీ అధిష్ఠానంతో మాట్లాడకుండా పార్టీలైన్ దాటి మాట్లాడే నేతలను కట్టడి చేసే ప్రక్రియ ప్రారంభమైంది. వివాదాస్పద అంశాలపై పార్టీ నేతలు మీడియా వేదికగా పార్టీలైన్‌కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ నేరు గా సూచన చేసింది.
వివాదాస్పద విషయాలపై పార్టీ లైన్‌కు విరుద్ధంగా మీడియా వేదికగా మాట్లాడరాదని పార్టీ నాయకులకు బీజేపీ రాష్ర్ట శాఖ సూచించింది. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదేశా ల మేరకు, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శుక్రవారం ఈ సూచనలు చేశారు. వివాదాస్పద అంశాలపై పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా పత్రికలకు లేదా మీడియా ముందుకు వెళ్లొద్దని ఆయన స్పష్టం చేశారు.