ఓటరు జాబితా ప్రక్షాళనలో నిర్లక్ష్యానికి తావులేదు
అలంపూర్, జూన్ 18: బిఎల్ ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా ప్రక్షాళన చేయాలని ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో భాగంగా మానవపాడు మండల కేంద్రంలో గురువారం బిఎల్‌ఓలు, బిఎల్‌ఎ మరియు బిఎల్‌ఒ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ తిమ్మారెడ్డి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, విధివిధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, బిఎల్‌ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా ప్రక్షాళన చేయాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హ పేర్లను తొలగించే ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానవపాడు తహసీల్దార్ ఎం.డి. మన్సూర్ అలీ సిద్ధిఖీ, ఎర్రవల్లి తహసీల్దార్ నరేష్, ఇటిక్యాల తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ కరుణాకర్, గురురాజ్, శ్రీవాణి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






