ప్రారంభం కంటే ముందే పగుళ్లు
* నాణ్యత లేని పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం...
* పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన పాయల్ శంకర్
బేల, జూన్ 18 (విజయక్రాంతి) : ప్రారంభోత్సవాని కంటే ముందే పంచాయతీ భవ నానికి పగుళ్లు తేలడంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగ్రహించారు. నాణ్యత లేని పనుల నిర్వాహణపై అసహనం వ్యక్తం చేశారు. బేల మండలంలోని ఎకోరి గ్రామంలో ఐటీడీఏ నిధులు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు.
అయితే ప్రారంభోత్సవం జరిగిన రోజే భవనంలో పగుళ్లు కనిపించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భవనాన్ని పరిశీలించిన ఆయన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భవనంలో బీటలు కనిపించడంపై సంబంధిత అధికారులను ప్రశ్నించి, ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులు నా ణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు.
నిర్మాణ పనుల తీరుపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే కాంట్రాక్టర్ నాసిర కం పనులు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రారంభోత్సవం రోజే లోపాలు బ యటపడటం నిర్మాణ పనుల నాణ్యతపై అ నుమానాలకు తావిస్తోందని వారు పేర్కొన్నారు.
సంబంధిత అధికారులు పూర్తి స్థా యిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవనంలోని లోపాలను వెంటనే సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.అనంతరం మండలంలోని జునోని గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించనున్న సావారి బంగ్లా నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాడేయ్ రేష్మ, ప్రజా ప్రతి నిధులు, అధికారులు, బీజేపీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






