25 August, 2026 | 2:32 AM

క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి

25-08-2026 01:34 AM

ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ 

టీజీపీఏలో ఏపీ ఎక్సైజ్ ఎస్‌ఐలకు మార్గదర్శనం

రాజేంద్రనగర్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో శిక్షణ పొందుతున్న 148 మంది ఏపీ ఎక్సైజ్ ఎస్‌ఐలతో ఆ శాఖ కమిషనర్ శ్రీధర్  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సోమవారం ముఖాముఖి నిర్వహించారు. శిక్షణ, వసతులు, భోజనం, వసతి, ఫిజికల్ ఫిట్నెస్పు ట్రైనీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. శిక్షణపై ట్రైనీలు సంతృప్తి వ్యక్తం చేయడంతో అధికారులు అభినందించారు.

అనంతరం ఎక్సైజ్ చట్టాల అమలు, ఎన్ఫోర్స్మెంట్, క్రమశిక్షణ, ఫీల్డ్లో ఎదురయ్యే సవాళ్లపై ప్రత్యేక తరగతులు నిర్వహించి మార్గదర్శనం చేశారు. టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్ట్  ఆధ్వర్యంలో ఎస్‌ఐలకు అత్యుత్తమ శిక్షణ, మౌలిక వసతులు కల్పిస్తున్న తీరును కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశంసించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరహరి, టీజీపీఏ అధికారులు, శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.