28 June, 2026 | 12:11 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

బొంద పెట్టడానికి స్థలం లేదు..!

09-05-2026 02:30 PM

క్రిస్టియన్ మైనార్టీల ఆవేదన

రామచంద్రపురం: రామచంద్రాపురం పట్టణంలోని మెతోడిస్ట్ చర్చి ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చర్చి పాస్టర్స్ మాట్లాడుతూ... పటాన్చెరువు నియోజకవర్గంలో 50 వేల వరకు క్రిస్టియన్ ప్రజలు నివసిస్తున్నారని వీరికి చనిపోతే ముందు పెట్టడానికి స్థలం లేదని ఆవేదన వెలుబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్ల పట్ల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలలో అడ్మిషన్స్  చర్చిల పునర్నిర్మాణం, మహిళలకు కుట్టు మిషన్స్, ఇలా అన్ని విషయాల్లో మద్దతునిస్తూ క్రిస్టియన్ సమాజానికి అండగా నిలుస్తుంది అని అన్నారు.

కానీ చనిపోయిన వాళ్లకి బొంద పెట్టుకోనికి స్థలం లేదని మానవతా దృక్పథంతో గవర్నమెంట్ ఆలోచించి నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ స్థలంలో క్రిస్టియన్ సమాజానికి పది ఎకరాల స్థలం గ్రేవీ యార్డుకి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.రామచంద్రపురం లో ఉన్న స్మశాన వాటికలో కేవలం బిహెచ్ఎల్ కు సంబంధించిన ఎంప్లాయిస్ కి మాత్రమే గ్రేవియార్డును వినియోగించుకోవడం అందులో కూడా ఒకరిని పూడ్చి పెట్టిన తర్వాత , మళ్లీ అదే బొందను తవ్వి మరొక మృతదేహాన్ని పూడ్చే దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు.ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని క్రిస్టియన్ల పట్ల అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డిన్ను (క్రిస్టియన్ మైనార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్),సామేల్ జోసఫ్, హారతి తధితరులు పాల్గొన్నారు.