రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది
బోథ్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల వద్ద పంట కొనుగోళ్లకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎక్కడ కూడా కొనుగోళ్లకు వెనుకాడేది లేదని ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ పేర్కొన్నారు. . ధనుర్ గ్రామంలో జొన్నల కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పంట కొనుగోలను నిర్లక్ష్యం చేసిందని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అన్నారు.
ఎకరానికి 20 గంటల వరకు జొన్న కొనుగోలు చేసే విధంగా చూస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రిని కలిసి విన్నవించడం జరిగిందన్నారు. పంట కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయిన రాష్ట్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. అధికార పార్టీ నాయకులు అర్థం లేని విమర్శలు చేయడం మానుకోవాలని కోరారు






