వర్షాలు సమృద్ధిగా పడాలి..
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వాసవి మాత, వారాహి దేవి అమ్మవార్లకు జలాభిషేకం
సుల్తానాబాద్, జులై 23 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి మాత దేవాలయం లో గురువా రం వారాహి మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవి మాత అమ్మవారికి... వారా హి మాత అమ్మవారికి వాసవి మాత దేవాలయం భక్తబృందం... ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జలాభిషేకం కార్యక్రమం ఘ నంగా నిర్వహించడం జరిగింది..
ఇందులో పె ద్ద ఎత్తున పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, భక్తులు అమ్మవార్ల కు జలాభిషేకం చేశారు, ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, రై తులతోపాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకుంటూ ఈ జలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించ డం జరిగిందన్నారు, ఈ కార్యక్రమం లో వాసవి మాత దేవాలయం భక్త బృందం, ఆ ర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, అర్చకులు వల్లకొండ మఠం మహేష్ రజిత దం పతులు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు....






