24 July, 2026 | 3:24 AM

మీ సేవ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్

24-07-2026 12:20 AM

కొండాపూర్, జూలై 23: కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ లో ఉన్న మీ సేవ కేంద్రాన్ని మండల రెవెన్యూ అధికారి అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం మల్కాపూర్ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 156, 157లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.

డిజిటలైజేషన్ పనులను వేగవంతంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పారదర్శకత, ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వివరాన్ని నిబంధనల ప్రకారం నమోదు చేయాలని తహసిల్దార్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.