calender_icon.png 3 December, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు లేకుండా చూడాలి

03-12-2025 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్  

కోదాడ, డిసెంబర్ 2: నామినేషన్  ప్రక్రియ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త లు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  ఆదేశించారు. అనంతగిరి గ్రామ పంచాయతీ  కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనంతగిరి, కిష్టపురం, అమీనాబాద్, కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గుడిబండ, అడ్లూర్, తొగర్రాయి, అల్వల పురం సర్పంచ్ లకు, వార్డు సభ్యుల ఎన్నిక నిమ్మిత్తం కొరకు ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని,అనంతగిరి ఎంపిడిఓ కార్యాలయాన్ని  మంగళవారం  ఆయన సందర్శించారు.

నామినేషన్ కేంద్రాలలో సాయంత్రం 5:00 గంటల తర్వాత నామినేషన్ వేయుటకు అభ్యర్థులు ఉంటే వారికి టోకెన్లు జారీ చేయాలని ఆదేశించారు. అనంతగిరి ఎంపిడిఓ కార్యాలయంలో  నామినేషన్ ఆన్లైన్ చేసే విధానాన్ని పరిశీలించారు. నామినేషన్ లను స్వీకరించిన తరువాత  వెంటనే ఎలాంటి తప్పులు దొర్లకుండా టి పోల్ యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ,తహసీల్దార్లు హిమబిందు, వాజీద్ అలీ, ఎంపిడిఓ లు హరి సింగ్, ఇజాక్ హుస్సేన్,ఎం పి ఓ సుష్మ,ఆర్ ఓ లు, అధికారులు, తదితరులు ఉన్నారు.