calender_icon.png 11 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు సంస్కారం ఉండాలి

11-09-2025 01:15:34 AM

-తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను  గౌరవించాలి

-మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు

ముషీరాబాద్, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): చదువుతో పాటు సంస్కారం ఉండాలని,  సంస్కారం లేని విద్య పరమ దండగ అని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తల్లిదండ్రులను గురువులను పెద్దలను ప్రతి ఒక్క రూ గౌరవించాలని ఆయన సూచించారు. 

ఈ మేరకు బుధవారం  రామకృష్ణ మఠంలోని స్వామి వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్సీ  25 సంవత్సరాల సిల్వ ర్ జూబ్లీ మహోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వివేకా నంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్సీ  లో శిక్షణ పొందిన విద్యార్థులు స్వామి వివేకానంద ప్రపంచానికి భోదించిన విషయా లపై నాటక రూపంలో ప్రదర్శించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాముడు మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి పదవి విరమణ చేశాక తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, నేను చేసింది పదవీ విరమణే కానీ, పెదవి విరమణ చేయలేదన్నారు. యువతను ఎక్కువగా కలుసుకో వాలని అనుకుంటున్నానని చెప్పాడు. మన సంస్కారం, సంస్కృతి సంప్రదాయాలు పద్దతులు సానుకూల దృక్పథం క్రమశిక్షణ అంకిత భావం కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వీటన్నింటి గురించి తెలియజేయాలని దేశ వ్యాప్తంగా తిరుగుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని నీటిని పొదు పుగా వాడుకొని కాపాడుకోవాలని ఆయన యువతకు సూచించారు. ఇటీవల నెల్లూరు వెళ్లిన సందర్భంలో కొలనులలో వినాయక నిమర్జనం చేయడం శుభ పరిణామమని అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భార త దేశంలో యువత ఎక్కువగా ఉందని వారి సేవలను భారత దేశం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు కథనాల వల్ల నేటి యువత పెడదోవ పట్టడంతో పాటు అనర్ధాలు అధికం అవుతున్నాయని చెప్పా రు.

తద్వారా నేరాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని స్వామి వివే కానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్సీ  ఆధ్వర్యంలో వేలాది మంది యువ తను సంస్కార వంతులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం భారత దేశం ఆర్ధిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉందని రాబోయే రోజుల్లో 3వ స్థానానికి చేరుకుంటుందని అన్నారు.

భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విజ్ఞతను చికాగో మహాసభల్లో స్వామి వివేకానంద ప్రపంచానికి వివరించి దేశ గొప్పతనాన్ని దాటి చెప్పారని ఆయన పేర్కొన్నారు. స్వామి వివేకానంద ఆశయ సాధనకోసం నేటి యువత పాటుపడాలని, యువత పెడదారులు పట్టకుండా సన్నారంలో వయనించాలని సూచించారు.

పాశ్చాత్య వ్యామోహానికి లోనవకుండా స్వదేశీ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ కుటుంబ వ్యవస్థను కాపాడుకో వాల ని పెద్దలను గౌరవించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద స్వామి, నిత్యా ముకుంటానం దజీతోపాటు వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.