calender_icon.png 11 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు ఏకతాటిపైకి రావాలి

11-09-2025 01:10:09 AM

-పోరాటాల ద్వారానే రాజ్యాధికారం

-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ 

-ఎల్బీనగర్‌లో బీసీల ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 10 (విజయక్రాంతి)/ఎల్బీనగర్: బీసీలు ఏకతాటిపైకి వచ్చి, పోరాటాలు చేస్తేనే రాజ్యాధి కారం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్‌లో బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గతకొన్ని సంవత్స రాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య సేవలు ఎనలేనివన్నారు. రాజ్యాధికారం సాధించాలంటే బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

పాలూరి రామకృష్ణయ్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో అత్యంత సన్నిహితం ఉన్నదని, గతంలో బీసీలకు రావాల్సిన వాటాలపై ఆయన జాతీ య స్థాయిలో పోరాటం చేశారని గుర్తు చేశా రు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన అయితగోని రాఘవేం ద్ర గౌడ్ యువకుడని, ఆయనకు పోరాటం చేసే ఓపిక, సత్తా ఉందని ప్రశంసించారు. వీరి ఆధ్వర్యంలో బీసీలకు రావాల్సిన వాటా సాధించుకోవడంతో పాటు రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. బీసీలంతా ఏకతాటిపైకి వస్తే రాజ్యాధి కారం సిద్ధించడం ఖాయమని బీసీ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితగోని రాఘవేంద్ర గౌడ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీ య అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య, కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజరాంయాదవ్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకులు పుటం పురుషోత్తమరావు తదితరులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఆమె విగ్రహానికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. 

గ్రూప్ నియామకాల్లో హైకోర్టు తీర్పును అమలు చేయాలి

గ్రూప్ సర్వీస్ నియామకాల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై హైకోర్టు తీర్పును రాష్ర్ట ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తక్షణమే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాం డ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరిపి, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

బుధవారం తెలంగాణ నిరుద్యోగుల చైర్మన్ నీల వెంకటేష్‌తో కలిసి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన వైఫల్యాలను ఎండగట్టారు. తెలుగు మాధ్య మంలో పరీక్ష రాసిన అభ్యర్థులపై తీవ్ర వివక్ష చూపిందని కృష్ణయ్య ఆరోపించారు. ఇంగ్లిష్ లో 12,381 మంది పరీక్ష రాస్తే 506 మంది ఎంపికయ్యారు. కానీ, తెలుగులో 8,694 మంది హాజరైతే కేవ లం 56 మంది మాత్రమే ఎంపిక కావడం దారుణమన్నారు.