20 June, 2026 | 3:39 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

ఇక్కడో చెరువుండేది!

14-10-2024 12:00 AM

ఔనూ! ఇక్కడో చెట్టుండేది 

ఎవరు పీకేశారు? 

అక్కడో చింతల తోపుండేది 

ఎవరు నరికేశారు? 

ఇదిగో ఇక్కడో చెరువుండేది 

ఎవరెత్తుకెళ్లారు? 

అక్కడో నది ఉండేది

ఎవరు పట్టుకెళ్లారు?

అరెరే..

గుడిసెలూ గూడాలూ 

పొలాలూ పుట్రలూ 

కొండలూ గుట్టలూ 

తుమ్మలూ తూములూ 

తోటలూ బాటలూ 

ఏ కొండ చిలువలు 

మింగేశాయి??

ఆ అవ్వ ఏమైపోయింది. 

ఆ పల్లె ఎటు వలస వెళ్లింది 

బావులన్నీ ఎక్కడున్నాయ్ 

చెలిమలన్నీ ఎందుకలిగాయ్? 

పశువులెక్కడ?

పక్షులెక్కడ?

మనుషులేరీ?

మమతలేవీ?

అన్నట్లూ... 

ఇక్కడో నాగరికత ఉండేది. 

ఎవరు తుడిచేశారు? 

విశిష్టమైన సంస్కృతి ఉండేది 

ఎవరు విషం కలిపారు? 

విలక్షణమైన జీవన 

విధానముండేది 

ఎందుకిలా మారిపోయింది? 

మిత్రులారా! కళ్లు తెరవండి 

‘ఇక్కడో దేశముండేది’ 

అని ప్రశ్నించే 

పరిస్థితిని తేకండి-

(హైడ్రా కూల్చివేతల 

నేపథ్యంలో...)

 డా. ఎస్వీ సత్యనారాయణ