08-02-2026 12:21:18 AM
18% సుంకం వర్తించే ఎగుమతులు:
టెక్స్‌టైల్స్, రెడిమేడ్ వస్తువులు
ప్లాస్టిక్, లెదర్, గృహాలంకరణ వస్తువులు
వాషింగ్టన్/ న్యూఢిల్లీ: భారత్- అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఒప్పందానికి సంబంధించి ఇరుదేశాలు శనివారం సంయుక్తంగా అధికారిక ప్రకటన విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై మొత్తంగా 50శాతం అమలవుతున్న సుంకాలను, 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది.
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా భారత్ ఒప్పందం చేసుకుని కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులు ఆధారపడిన రంగాల ప్రయోజనాలను కాపాడిందని, ఒప్పందంతో అమెరికన్ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాడి పరిశ్రమను నమ్ముకున్న పాడి రైతులకు భరోసానిస్తూ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను వంటి డెయిరీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాల తగ్గింపునకు భారత్ నిరాకరించింది.
దేశ ఆహార భద్రతలో కీలకమైన గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఇతర మాంస ఉత్పత్తులనూ ఒప్పందం నుంచి మినహాయించింది. దీనివల్ల మన దేశీయ మార్కెట్‌లోకి వచ్చే విదేశీ ఉత్పత్తులు చౌకగా వచ్చే అవకాశం ఉండదు. అలాగే దిగుమతి పరంగా జన్యుమార్పిడి ఉత్పత్తులకు భారత్ అంగీకరించలేదు. దౌత్యపరంగా ఈ ఒప్పందం భారత్‌కు గొప్ప విజయం సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా షరతులు
రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు దిగుమతులను భారత్ పూర్తిగా నిలిపివేయాలని అమెరికా షరతు పెట్టింది. అమెరికా లేదా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయవచ్చని సూచించింది. ఒకవేళ భారత్ మళ్లీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే 25 శాతం అదనపు సుంకాలు యథావిధిగా విధిస్తామని స్పష్టం చేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున, అప్పటికే అమలవుతున్న ౨౫శాతం సాధారాణ సుంకాలకు, అదనంగా మరో ౨౫ శాతం కలిపి.. మొత్తం ౫౦శాతం సుంకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చైనా, వియత్నాంతో పోటీ
టెక్స్‌టైల్స్, రెడిమేడ్ వస్తువులు, ప్లాస్టిక్, లెదర్, గృహాలంకరణ వస్తువులను ౧౮శాతం ఎగమతి సుంకంతో ఎగుమతి చేయవచ్చు. కొత్త ఒప్పందంతో భారత ఎగుమతిదారులు గ్లోబల్ మార్కెట్‌లో చైనా వంటి దేశాలతో దీటుగా పోటీ పడవచ్చు. అమెరికా ప్రస్తుతం చైనాపై 35శాతం, వియత్నాం 20 శాతం ఎగుమతి సుంకాలు విధిస్తున్నది. భారత్‌పై ౧౮ శాతం సుంకమే ఉండటంతో, చైనా, వియత్నాం కంటే భారత్ ఎక్కువ వస్తువులు ఎగుమతి చేసి.. ఆ దేశాలతో పోటీ పడే అవకాశం ఉంది. మరో ఆసియా దేశమైన జపాన్‌తోనూ పోటీ పడవచ్చు.
‘మేక్ ఇన్ ఇండియా’కు సరికొత్త బలం: మోదీ
భారత్ -అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం దేశీయ తయారీ రం గాని(మేక్ ఇన్ ఇండియా)కి కొత్త ఊపిరి పోస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు. భారతదే శవ్యాప్తంగా రైతులు, ఔత్సాహి క పారిశ్రామికవేత్తలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు, స్టార్టప్ ఆవిష్క ర్తలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తా యని ఆకాంక్షించారు. అలాగే దేశ వ్యాప్తం గా యువతకు, మహిళలకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
దేశాన్ని ‘వికసిత్ భారత్ 2047’ వైపు అడుగులు వేయించేందుకు ఒప్పందం ఉపయోగపడుతుందని, రెండు దేశాల మధ్య పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వ్యక్తిగత చొరవ చూపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భారత అంతర్భాగంలో పీవోకే.. అక్సాయిచిన్
పాకిస్థాన్, చైనా కళ్లలో కారంకొట్టే విధంగా అమెరికా పోస్ట్
పరోక్షంగా తాము భారత్ పక్షాన నిలుస్తామని అగ్రరాజ్యం సంకేతాలు
వాషింగ్టన్ /న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అమెరికా భారత్ మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికన్ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్‌టీఆర్) శనివారం తన సోషల్‌మీడియా ఖాతాలో పాకిస్థాన్, చైనా కళ్లలో కారంకొట్టేలా సంచలన పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ద్వారా ట్యాగ్ అయిన భారత మ్యాప్‌లో అంతర్భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తోపాటు చైనా ఆధీనంలోని అక్సాయిచిన్ ప్రాంతం ఉండటం గమనార్హం. గతంలో అమెరికా విడుదల చేసిన భారత్ మ్యాప్‌లు వివాదాస్పదంగా ఉండేవి. కాగా.. ఇప్పుడు ముఖ్యంగా పీవోకే విషయంలో పాక్ అనుకూలంగా అమెరికా వ్యవహరించేది. ఇప్పుడలా కాకుండా.. జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగంగా పీవోకేను కలిపి ఉన్న మ్యాప్‌ను పోస్ట్ చేయడం భారతదేశ ప్రజలను ఆకర్షించింది.
తాజా చర్య పాకిస్థాన్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక అని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్ విషయంలో తాము భారత్‌కే మద్దతు ఇస్తున్నట్లు అమెరికా సంకేతాలిచ్చిందని పేర్కొంటున్నారు. అయితే.. ఆరు నెలల నుంచి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కాలికి బలపం కట్టుకుని అమెరికా చుట్టూ తిరుగుతూ, ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నప్పటికీ.. ఆయన్ను లెక్క చేయకుండా ట్రంప్.. భారత్‌కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఆసియా దేశాల్లోనే అతి తక్కువ అమెరికా సుంకాల భారం భారత్‌పైనే ఉండటం విశేషం. అత్యధిక సుంకాల భారం ప్రస్తుతం చైనా మోస్తున్నది.
ఒప్పందం వర్తించని వస్తువులు
డెయిరీ ఉత్పత్తులు (పాలు, పెరుగు, వెన్న మొదలైనవి)
చేనేత వస్త్రాలు, హస్తకళలు,
ఇతర వ్యవసాయ ఉత్పత్తులు
దిగుమతయ్యే వస్తువులు
ఎర్ర జొన్నలు, బాదం, సోయాబిన్ ఆయిల్, ట్రీ నట్స్,
వైన్స్, స్పిరిట్స్, వైద్య
పరికరాలు, సౌందర్య సాధనాలు
జీరో సుంకం వర్తించే ఎగుమతులు
టీ, కాఫీ, మసాలా దినుసులు, కొబ్బరి నూనె, వాల్‌నట్స్, పండ్లు, కూరగాయలు, జెనరిక్ మెడిసిన్, వజ్రాలు, రత్నాలు, స్మార్ట్‌ఫోన్లు, విమాన విడిభాగాలు
‘జీరో’ సుంకం వర్తించే ఎగుమతులు
టీ, కాఫీ
మసాలా దినుసులు
కొబ్బరి నూనె
వాల్‌నట్స్
పండ్లు, కూరగాయలు
జెనరిక్ మెడిసిన్
వజ్రాలు, రత్నాలు
స్మార్ట్‌ఫోన్లు
విమాన విడిభాగాలు
ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ ‘18%’ సుంకం వర్తించే ఎగుమతులు
టెక్స్‌టైల్స్, రెడిమేడ్ వస్తువులు
ప్లాస్టిక్, లెదర్ వస్తువులు
గృహాలంకరణ వస్తువులుదిగుమతయ్యే వస్తువులు
ఎర్ర జొన్నలు, బాదం
సోయాబిన్ ఆయిల్
ట్రీ నట్స్, వైన్స్
స్పిరిట్స్, వైద్యపరికరాలు
సౌందర్య సాధనాలు ఒప్పందం వర్తించని వస్తువులు
డెయిరీ ఉత్పత్తులు (పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవి)
చేనేత వస్త్రాలు
హస్తకళలు
గొధుమలు, ధాన్యం, చిరు ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు