7 August, 2026 | 3:54 AM

సాగునీరు, ఎరువుల కొరత ఉండదు.. రైతులకు అండగా ప్రభుత్వం

07-08-2026 02:19 AM

పెద్దపల్లి, ఓదెల, (విజయ క్రాంతి): రైతులకు సాగునీరు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట వి జయరమణరావు అన్నారు. గురువారం ఓదెల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావే శంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప లు శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అవసరానికి మించి యూరియా, డీఏపీ ఎరువుల ను వినియోగించడం వల్ల భూముల సారవంతత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమతుల్య ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ వ్య వసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూ చించారు. గ్రామాల్లో సర్పంచులు, వ్యవసాయ అధికారులు రైతులకు భూసార పరిరక్షణ, శాస్త్రీయ సాగు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రైతు వేదికల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యా మ్నాయ పంటల సాగుపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలి పారు. యాప్ ఆధారిత యూరియా సరఫ రా విధానం అమలుతో ఎరువుల వినియోగం క్రమబద్ధీకరించబడిందని, భూము ల సారం మెరుగుపడి దిగుబడులు కూడా పెరిగాయని పేర్కొన్నారు.ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ఎస్సారెస్పీకి నీటి నిల్వలు మెరుగుపడుతున్నాయని, తెలంగాణ రైతులు సాగునీటి విషయంలో ఆందో ళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఎస్సారెస్పీ కాలువల్లో నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.నీటి విడుదలకు ముందే ఎస్సారెస్పీ ప్రధాన, ఉప కాలువల్లో బుష్ క్లియరెన్స్ పనులు వెంటనే చేపట్టి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి కూడా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. 

గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రైతులకు అవసరమైన సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు.ఈ కార్య క్రమం లో ఓదెల ఎంపీడీవో, తహసీల్దార్, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.