7 August, 2026 | 3:31 AM

ఉపాధ్యాయులను నియమించాలని ఆందోళన బాట పట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు

07-08-2026 02:18 AM

ఎర్రుపాలెం ఆగస్టు 6 (విజయక్రాంతి): మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. గురువారం నాడు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేమిడిచర్ల లో బయాలజీ, సోషల్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ఉన్నత పాఠశాల గేట్లకు తాళం వేసి ఆందోళన నిర్వహిస్తున్నారు.

బయాలజీ సోషల్ చెప్పే ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యాధికారులు నియమించకపోవడంతో తమ పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కు వినతి పత్రము అందించామని, జిల్లా డిఇఓ కూడా వినతి పత్రము అందించామని, మండల ఎంఈఓకు కూడా వినతి పత్రం అందించామని దీనిపై విద్యాధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ స్పందించడం లేదని, దీనివల్ల తమ పిల్లలు ఉపాధ్యాయులు లేకపోవడంతో సిలబస్ చెప్పకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ సామినేని రామారావు పేర్కొన్నారు. వెంటనే పాఠశాలకు బయాలజీ సోషల్ చెప్పే ఉపాధ్యాయులు నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గ్రామ సర్పంచ్ కాపు వరప్రసాదరావు కోరారు. ఈ ఆందోళన బాటలో నూతక్కి నరసింహారావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.