calender_icon.png 16 September, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్జరీ సంతకాలతో పట్టా చేసుకుండ్రు

16-09-2025 12:00:00 AM

  1. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోండి

తాసిల్దార్ ముందు గోడువెల్లబోసుకున్న పట్టాదారులు కిషన్ నాయక్ దంపతులు

చిన్న చింతకుంట, సెప్టెంబర్ 15 : ఫోర్జరీ సంతకాలు చేసి మా భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని... పూర్తి విచారణ చేసిన తర్వాతే మాకు న్యాయం చేయండి అంటూ మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం తాసిల్దార్ కార్యాలయం లో తాసిల్దారు ముందు కిషన్ నాయక్ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. వారు చెప్పిన మాటల్లో ఇలా... మా గ్రామం మన్ది పల్లి తాండ ధన్వాడ మండలం నారాయణ పేట జిల్లాకు చెందిన వారిమి.

చిన్నచింతకుం మండల కేంద్రంలోని పర్దిపూర్ గ్రామ శివారులో భూమి సర్వే నెంబర్ 493/ఇ ఈ లో మండల పరిధిలోని పర్టీపూర్ గ్రామ శివారులో 2-32 ఎకరాలు ఉంది. ఇక్కడ బతుకు తెరువు సరిగా లేకపోవడంతో సౌదీకి వెళ్లాను. నా భూమి ఎక్కడ పోతుందిలే అని అనుకున్నాను.

తీరా ఇప్పుడు చూస్తే గతంలో ఎప్పుడో నా భూమి ఫోర్జరీ సంతకాలతో మా అక్క శంకరమ్మ భర్త నర్య్యనాయక్, నివాసము మల్లెనాయక్ తండా, ఫరీద్పూర్ గ్రామము, చిన్నచింతకుంట మండలము వారి మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అధికారులు పూర్తిచేయల విచారణ చేసి మాకు సంబంధించిన భూమిని మాకు అప్పజెప్పాలని విన్నవించారు. తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన వారిలో బీఎస్పీ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇంచార్జి సంతోష్ రెడ్డి, రాకేష్, మల్లెల బాలరాజు పాల్గొన్నారు.