అబద్ధపు హామీలతో గద్దెనెక్కారు
- అలవి కానీ హామీలు... అంకెల గారడి
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
భారాస జిల్లా అధ్యక్షులు జీ వీ రామకృష్ణారావు
మానకొండూరు, మార్చి 23 (విజయక్రాంతి):అబద్ధపు హామీలతో గద్దెనెక్కి, రెం డున్నర సంవత్సరాల పాటు మనగడ సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరు గ్యారంటీ ల అమలులో కానీ, బడ్జెట్ కేటాయింపులో సై తం మొండి చేయి చూపిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిష న్, కరీంనగర్ భా రాస జిల్లా అధ్యక్షులు జీ వీ రామకృష్ణారావు విమర్శించారు.
అలవికాని హామీలిచ్చి, పాలన చేతకాక తడబడి ముందుగా వంద రోజుల సమయం కావాల ని, ముచ్చటగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోను ఆయా రంగాలకు తగినంత నిధు లు కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మానకొండూరులోని భారత రాష్ట్ర సమితి పార్టీ నియోజకవర్గ కా ర్యాలయంలో పార్టీ మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు కేతిరి దేవేందర్ రెడ్డి, పిట్టల మధు, శాతరాజు యాదగిరి, రా చకట్ల వెంకటస్వామి దండబోయిన శేఖర్ త దితరులతో కలిసి ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
అంతకు ముందు ఆరు గ్యారంటీల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం, ఆమోదించిన ఏ రంగంలోనూ బడ్జెట్లో కేటాయింపులు జరుపకుండా ప్రజలను మోసం చేయడాన్ని నిర సిస్తూ, హామీల అమలుపై కాంగ్రెస్ వైఫల్యాలను ఖండిస్తూ, అబద్ధపు హామీల కరప త్రాలను దహనం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఆ ఊసే కరువైందని, ఇది కాంగ్రెస్ దిగజారుడుతనానికి, దివాలా కోరుతనానికి నిద ర్శనమన్నారు.
మహిళా సంఘాల్లోని మహిళలను వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు బల వంతంగా రప్పించడం అదీ ఇందిరమ్మ చీరలనే ధరించి హాజరు కావాలని హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తులం బంగారం హామీలో బడ్జెట్ కేటాయింపు ఏమైందని వ్యంగ్యంగా ప్రశ్నించారు. మూడు పంటలకు అన్నదాతలకు 15వేల రూపాయలు ఇస్తామ ని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బడ్జెట్లోనూ అరాకొర ని ధులతో సరిపెడుతున్నారని దీంతో రైతుల ప రిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కౌలు రైతులకు 12 వేల రూపాయలు ఇస్తామని అ న్నదాతలను మోసం చేశారని ఆగ్రహం వ్య క్తం చేశారు. నిరుద్యోగ యువతకు జాబ్ క్యా లెండర్, బీసీలకు లక్ష కోట్లు, ఆర్టీసీ కార్మికులకు బకాయిలేవి.. ప్రభుత్వంలో విలీనమేది, అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ సర్కారు పాలనలో విఫలమైందని ఆరోపించారు.




