బలం లేకనే బరితెగించారు
మేయర్, కార్పొరేటర్లపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఫీర్జాదిగూడ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి రఘువర్ధన్
మేడ్చల్, మే 20 (విజయక్రాంతి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బలం లేకనే కాంగ్రెస్ నాయకులు బరితెగించారని ఫీర్జాదిగూడ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవెళ్లి రఘువర్ధన్ ఆరోపించారు. మేయర్ పెట్టిన అవిశ్వాసంలో నెగ్గలేకనే సుధీర్‌రెడ్డి డైరెక్షన్‌లో అమర్‌సింగ్ అనైతిక రాజకీయాలకు తెరలేపారని ఆయన అన్నారు. ఫీర్జాదిగూడ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుధీర్‌రెడ్డి స్వార్ధం కోసం అమర్‌సింగ్‌ను పావుగా వాడుకుని క్యాంపు ల పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించారన్నారు.
పెట్టిన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరవుతుందనే ఉద్ధేశంతో అమర్‌సింగ్ మేయర్ జక్క వెంకట్‌రెడ్డితో పాటు సహచర బీఆర్‌ఎస్ కార్పొరేటర్లపై హత్యారాజకీయాలకు తెగబడ్డారన్నారు. ఓఆర్‌ఆర్‌పై అమర్‌సింగ్ తీసుకొచ్చిన ప్రైవేట్ గుండాలు, కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలపై పోలీసులు కేసునమోదు చేసే అవకాశం ఉం డడంతో హాస్పిటల్ పేరుతో హైడ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. అమర్ సింగ్ కాంగ్రెస్ పెయిడ్ గ్యాంగ్ ఓఆర్‌ఆర్‌పై చేసిన హంగామా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పేర్కొన్నారు. మేయర్ వెంకట్‌రెడ్డి ము న్సిపల్ నిబంధనలకు లోబడి తన బలంను నిరూపించుకునేందుకు తానే అవిశ్వాసం పెట్టారని, జూన్ 5వ తేదీన కలెక్టర్ అవిశ్వాసం నిర్వహించేందుకు గడువు ఇచ్చారన్నారు.
పోలీసులకు ఫిర్యాదు
మేయర్ జక్కా వెంకట్‌రెడ్డితో పాటు కార్పొరేటర్లపై జరిగిన కిడ్నప్ వ్యవహారంపై బీఆర్‌ఎస్ నాయకులు ఘట్‌కేసర్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో టీఎస్ 08 జేసీ 0019, టీఎస్ 08 జీజీ 1122 , టీఎస్ 08 జీవీ 3555 నంబరు గల కార్లలో సూర్యాపేట నుంచి నోవాటెల్ హోటల్‌కు వెళ్తున్నారని తెలిపారు. అయితే హయత్‌నగర్ ఓఆర్‌ఆర్ ఎంట్రీ వద్ద వీరి కార్లను అమర్‌సింగ్, టి. శ్రీధర్‌రెడ్డి, బి. నవీన్‌రెడ్డి, ఎం. చంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, పి. అంజిరెడ్డి, శివకుమార్‌గౌడ్, నర్సింహరెడ్డితో పాటు ఓ 50 మంది కిరాయి వ్యక్తులు టీఎస్ 08 హెచ్‌ఎఫ్ 0022, టీఎస్ 08 జీసీ 669 నంబర్లు గల కార్లతో పాటు మరో 20 కార్లలో మారణాయుదాలతో వెంబడించారని, ఈ వ్యవహారంపై ఔటర్‌పై, ఔటర్ ఎగ్జిట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.






