విత్తనాల కొరతపై రైతుల ఆగ్రహం
21-05-2024 02:58 AM
ఆదిలాబాద్, మే 20 (విజయక్రాంతి): వానకాలం సీజన్ ప్రారంభమే కాలేదు అంతలోనే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులను విత్తనాల కొరత వేధిస్తోంది. సోమ వారం షాపుల ఎదుట పడిగాపులు కాసిన రైతులు విత్తనాలు దొరకకపోవడంతో ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో అక్కడకు వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు వారిని సముదాయించినప్పటికీ ఫలితం లేకపోగా, అధికారులతో అన్నదాతలు వాగ్వాదానికి దిగారు. డీలర్లు డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






