calender_icon.png 2 August, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలను పట్టించుకోకుండా పట్టణాన్ని సర్వనాశనం చేశారు

02-08-2025 05:17:01 PM

పట్టణంలోని 9, 25, 26 వార్డులలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్..

ఎమ్మెల్యే మేఘారెడ్డి..

వనపర్తి (విజయక్రాంతి): గత పాలకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వనపర్తి పట్టణంలో ఉండే సమస్యలను పట్టించుకోకుండా వనపర్తి పట్టణాన్ని సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే మేఘారెడ్డి(MLA Megha Reddy) అన్నారు. ఆదివారం పట్టణంలోని 9, 25, 26 వార్డులలో రామాలయం నుండి మర్రికుంట వరకు మార్నింగ్ వాక్ చేస్తూ రోడ్డు వైండింగ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వార్డులో ఉండే సమస్యలు సీసీ రోడ్లు, కరెంటు స్తంభాలు, మురికి కాలువలు, వీధిలైట్లు, పెన్షన్లు వెయ్యకుండా మాయ మాటలు చెప్పి పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈనాడు ఏ ముఖం పెట్టుకొని వార్డులో తిరుగుతున్నారు.

మీ రాజకీయ లబ్ధి కోసం మీరు వార్డుల్లో తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలలో రేవంత్ రెడ్డి  సర్కార్ అని ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పథకాలు అందించే విధంగా ముందుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ సత్యం సాగర్ బ్రహ్మం చారి యాదగిరి జంపన్న పాషా నాయక్ మధు గౌడ్ నందిమల్ల శ్యామ్ శరవంద ఎల్ఐసి కృష్ణ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆదిత్య  తదితరులు పాల్గొన్నారు.