02-08-2025 05:06:57 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజులపాటు రక్షాబంధన్ వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Swapna Multi Super Specialty Hospital) వైద్యులు శశికాంత్ పేర్కొన్నారు. వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను నిర్మల్ లోని ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సుమారు లక్ష కరపత్రాలను పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ, కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనాలన్నారు. నేటి సమాజంలో యువత చెడుదారిలో నడుస్తున్న తరుణంలో వారిలో మార్పు తీసుకువచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన శేట్ పల్లి అరుణ్ శర్మను ఆయన అభినందించారు. ఇందులో సాదం ఆనంద్, కత్రోజ్ అశోక్ చారి, తదితరులు ఉన్నారు.