calender_icon.png 2 August, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల ఐదు నుంచి సదరన్ క్యాంపులు

02-08-2025 05:19:18 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సర్టిఫికెట్ల పంపిణీ కోసం ఈ నెల ఐదు నుంచి సదరన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాస్(District Officer Srinivas) తెలిపారు. ఆన్లైన్లో పేరు నమోదు చేసిన వారు ఈనెల ఐదు నుంచి వచ్చే నెల ఆరు వరకు నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో వివిధ వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ఆర్థోపెడిక్ చెవిటి మూగ మానసిక దివ్యాంగుల క్యాంపులు ఉంటాయని ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.