15 August, 2026 | 9:12 AM

ప్రీక్వార్టర్స్‌లో సతీశ్

22-08-2024 12:30 AM

యోకొహమా: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ సతీశ్ కుమార్ కరుణాకరన్ ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సతీశ్‌తో తలపడిన అండ ర్స్ ఆంటోన్సన్ మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాడు. దీంతో సతీశ్‌కు ప్రీక్వార్టర్స్‌కు వాకోవర్ లభించింది. ఈ నేపథ్యంలో సతీశ్ తొలి గేమ్‌లో 6 ఆంటోన్‌న్సన్‌పై ఆధిక్యంలో నిలిచాడు. ప్రీక్వార్ట ర్స్‌లో సతీశ్ థాయ్‌లాండ్‌కు చెంది న వాంగ్‌చరోన్‌ను ఎదుర్కోనున్నా డు. మరో సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ జంటతో పాటు మిక్స్‌డ్ డబు ల్స్‌లో సుమిత్ ద్వయం తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.