calender_icon.png 29 July, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ గుర్తింపుకార్డునైనా ఫోర్జరీ చేస్తారుగా!

29-07-2025 02:14:19 AM

  1. ఈసీని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం
  2. ఆధార్‌ను గుర్తింపు కార్డుల జాబితా నుంచి మినహాయించడాన్ని మరోసారి తప్పుబట్టిన సుప్రీం
  3. ఆధార్‌తోపాటు ఓటర్ ఐడీని డాక్యుమెంట్ల కింద పరిగణించాలని ఈసీకి స్పష్టం 
  4. ఒకవేళ పరిగణనలోకి తీసుకోకుంటే కారణాలు తెలియజేయాలని ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 28: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమోదయోగ్యమైన గు ర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్‌ను మి నహాయించాలనే అంశంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వెరిఫికేషన్ కోసం పరిశీలించాలనుకుంటున్న 11 పత్రా ల్లో ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను చేర్చకపోవడంపై పలువురు సుప్రీంను ఆశ్రయిం చారు.

బీహార్ ఓటర్ల జాబితా ‘ప్రత్యేక ము మ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్)పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆధార్‌ను గుర్తింపు కార్డు గా పరిగణించకపోవడంపై ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ సీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆధార్‌ను ఓటర్ జాబితా గుర్తింపు కోసం ఎం దుకు పరిగణించడం లేదు. ఏ గుర్తింపు కా ర్డునైనా ఫోర్జరీ చేస్తారుగా’ అని పేర్కొంది.

జూలై 10న విచారణ సందర్భంగా బీహార్ ఓ టర్ లిస్ట్ రివిజన్ సబబేనన్న సుప్రీం ధర్మాసనం.. అదే సమయంలో ఆధార్, ఎపిక్, రే షన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందేని ఈసీకి స్పష్టం చేసింది. తాజా వాద నల సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దేశ పౌరసత్వానికి ఆధార్ రుజువు కాదన్నారు. దేశం లో నకిలీ రేషన్, ఆధార్ కార్డుల సమస్యగా మారాయన్నారు.

ఆధార్ కార్డులను ఫోర్జరీ చేస్తుండటం వల్ల కేవలం ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై యోచిస్తున్నట్టు తెలి పారు. అయితే, వెరిఫికేషన్ కోసం ఆధార్‌ను గుర్తింపుగా సమర్పించవచ్చని.. దీనిపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో పొందుపరిచా మని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్పం దిస్తూ ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్‌ను ఫో ర్జరీ చేయలేరో చెప్పాలంటూ ప్రశ్నించింది.

ఓటర్ నమోదు సమయంలో ఆధార్ ప్రస్తావన ఉన్నప్పటికీ.. ఓటరు జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని మరోసారి నిలదీసింది. ఎన్నికల సంఘం జాబి తాలోని ఏదీ నిర్ణయాత్మక పత్రం కాదు కదా.. ఆధార్, ఎపిక్ విషయాల్లో మీరు ఎత్తి న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుం టే రేపు మీరు అంగీకరించిన ఇతర పత్రాలు కూడా ఫోర్జరీ జరిగితే.. దాన్ని నిరోధించే వ్య వస్థ మీ దగ్గర ఉందా అని ప్రశ్నించింది.

అదే సమయంలో ఆగస్టు 1న ఈసీ ప్రచురించబోయే బీహార్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్‌పై మధ్యం తర స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యా యవాది గోపాల్ శంకర్‌నారాయణన్ కోరా రు. మంగళవారం జరిగే విచారణలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ స్పష్టం చేసింది.