calender_icon.png 29 July, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న నిసార్ ప్రయోగం

29-07-2025 02:11:58 AM

  1. శ్రీహరికోట నుంచి సాయంత్రం 5.40 గంటలకు 
  2. జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా నింగిలోకి
  3. భూకంపాలు, కొండ చరియలు విరిగిపడే ముప్పును పసిగట్టనున్న ఉపగ్రహం
  4. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపకల్పన

న్యూఢిల్లీ, జూలై 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికో టలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 30న సా యంత్రం 5.40 గంటలకు జీఎస్‌ఎల్వీఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అ న్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. 2,393 కిలోల బరువు కలిగిన నిసా ర్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా కలిసి సంయుక్తంగా రూపకల్పన చేశాయి.

నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా యి. వాతావరణ పరిస్థితులు, కొండచరియలు విరిగిపడటాన్ని, భూకం పాలను, అగ్నిపర్వతాలు బద్దలవ్వడాన్ని ముందే గుర్తించనుంది. భూ మి అణువణువును 12 రోజులకోసారి స్కాన్ చేయనుంది. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచుప్రాంతాలు ఇలా అన్నింటిని జల్లెడ పట్టనుంది.

ఈ ఉపగ్రహం భూమికి 743 కిలోమీటర్ల ఎత్తున సూర్యానువర్తన కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశీ లించనుంది. దీనిలో నాసాకు చెంది న ఎల్-బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్-బ్యాండ్ రాడార్లు, రెండింటి డేటాను సమ్మిళితం చేసే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్, 12 మీటర్ల వెడల్పు ఉండే జల్లెడ వంటి ప్రత్యేక రాడార్ యాంటెన్నా ఉంటాయి. సన్నాహకాల్లో భాగంగా ఆదివారం రాకెట్ రిహార్సల్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహిం చారు.

రాకెట్‌ను మొబైల్ సర్వీస్ టవర్ నుంచి ముందుకు తీసుకొచ్చి మళ్లీ వెనక్కి తీసుకెళ్లే ప్రయోగం ప్రక్రియను నిర్వహించారు. ఇది నాసా- ఇస్రో ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో అమెరికా శాస్త్రవేత్తలు కూడా షార్‌కు రానున్నారు. నిసార్ ప్రాజెక్టులో నాసా, ఇస్రోలకు చెరో సగం సమాన వాటా ఉన్నాయి. ప్రాజెక్టు మొత్తం వ్యయం ౧౧,౨౦౦ కోట్లు కాగా.. అందులో ఇస్రో ఖర్చు ౧౨౦౦ కోట్లు అని అంచనా