29-07-2025 02:22:04 AM
న్యూఢిల్లీ, జూలై 28: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిం దూర్ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి చిన్న విరామం మాత్రమే ఇచ్చామని.. పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్ప డితే ఆపరేషన్ తిరిగి ప్రారంభమవుతోందని హెచ్చరించారు. కాల్పుల విరమణలో అమెరికా సహా ఏ దేశ ప్రమేయం లేదని.. త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్ తట్టుకోలేక కాళ్ల బేరానికి రావడంతోనే ఆపరేషన్ ఆపినట్టు తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి, ‘ఆప రేషన్ సిందూర్’పై లోక్‌సభలో సోమవారం ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చర్చను ఉదయం రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మే 7న రాత్రి భారత బలగాలు తమ శక్తి సామర్థ్యాలు చాటి చెప్పా యి. పీవోకే, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారు. మన సైనికులు ఏడు ఉ గ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. కే వలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేశా రు.
2025 మే 10వ తేదీన మధ్యాహ్నం భారత్‌పై డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, ఇతర ఆయుధాలతో పాక్ దాడులకు తెగబడింది. అయితే ఎస్ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ పూర్తిగా పాక్ దాడులను తిప్పికొట్టాయి. సిం దూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సైన్యానికి అభినందనలు. దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత. ఆపరేషన్ సిందూర్ తర్వా త పాక్ సైన్యం మనపై దాడికి దిగింది.
మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చాం. భారత దాడులను అనేక దేశాలు సమర్థించాయి. యుద్ధం మా లక్ష్యం కాదు.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే మా విధానం. మనం చేసిన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. త్రివిధ దళాల దాడులు తట్టుకోలేక పాక్ డీజీఎంవో వెంటనే మనకు ఫోన్ చేశారు. భుజ్, ఉధంపూర్ స్థావరాలకు వెళ్లి మన సైనికుల సత్తా ప్రత్యక్షంగా చూశా.
సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదు. స్నేహహస్తంలో భారత్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. 1962 చైనాతో యుద్ధం కావొచ్చు.. 1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్‌పేయి లా హోర్ యాత్ర చేపట్టారు. పాకిస్థాన్‌తో భా రత్ స్నేహం కోరుకుంటుందని వాజ్‌పేయి అప్పుడే చెప్పారు. ఆనాడు వాజ్‌పేయి నిర్ణ యం తీసుకుంటే పాక్ మరో సూర్యోదయం చూసి ఉండేది కాదు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ అధికారులు పాల్గొన్నారు. దీనిని బట్టి ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుం దో అర్థం చేసుకోవాలి. భారత్ స్నేహ హస్తా న్ని పాక్ అందుకోలేకపోయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఆ దేశానికే ఇబ్బందిగా మా రుతుంది.’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
ట్రంప్ అంటే మోదీకి అంత భయమెందుకు?
ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తృణముల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. ట్రంప్ ముందు మీరు నిలబడిన ప్పుడు మీ ఎత్తు 5 ఫీట్లకు తగ్గుతుందని, మీ ఛాతి 56 ఇంచుల నుంచి 36 ఇంచులకు కుంచించుకుపోతుందని.. ట్రంప్ అంటే మోదీ ఎందుకు భయపెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
ఎన్నికల నేపథ్యంలో తర చూ బీహార్‌కు వెళ్తున్న ప్రధాని మోదీ పహల్గాంకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలని శివసే న ఎంపీ అరవింద్ సావంత్ ప్రశ్నించారు. కాగా ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం లోక్‌సభలో మా ట్లాడనున్నారు. రాజ్యసభలో రాజ్‌నాథ్ సి ంగ్ ప్రారంభించనుండగా.. ప్రతిపక్ష నేత మ ల్లికార్జున ఖర్గే చర్చలో పాల్గొంటారు.
అమెరికా ప్రమేయం ఎంతమాత్రం లేదు: జైశంకర్
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమాత్రం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య ఎలాంటి ఫో న్ సంభాషణలు జరగలేదని తేల్చి చెప్పారు.
అమెరికా మధ్యవర్తిత్వం అనేది కేవలం ఊ హాగానాలు మాత్రమే అని.. ఏప్రిల్ 22 17 మధ్య మోదీకి ట్రంప్ అసలు ఫోన్ చేయలేదని వివరించారు. భారత్,పాక్ మధ్య నేరుగా జరిగా కమ్యూనికేషన్‌తోనే కాల్పుల విరమణపై అవగాహన వచ్చిందన్నారు. లష్కరే తోయిబా తొత్తు అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ను అమెరికా ఉగ్రవాద సంస్థగా పేర్కొనడం భారత దౌత్యానికి గౌరవమన్నారు.
ఉగ్రవాదులు ఎలా వచ్చారు?: ఎంపీ గౌరవ్ గొగోయ్
పాక్ కుట్రలను సాగనివ్వకూడదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై అనేక సందేహాలు ఉన్నాయని.. అందులో కొన్నింటికి రాజ్‌నాథ్ సమాధానమిచ్చినప్పటికీ.. అసలు పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా వచ్చారన్నది చెప్పలేదన్నారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి వంద రోజులయిందని.. ఉగ్రవాదులకు మద్దతిచ్చిన వారి గురించి సర్కారు వద్ద సమాధానం లేదు. ఆర్టికల్ 360 ఎత్తివేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ సురక్షితంగా మారిందన్నారు. ప్రభుత్వ హామీతో జమ్ముకు పర్యాటకుల తాకిడి మొదలైందని.. ఈలోగా ఈ దారుణం చోటుచేసుకోవడం దారుణమన్నారు.
‘ఆపరేషన్ తందూర్’ కోరుకున్నాం: ఎంపీ రామశంకర్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం ఆపరేషన్ తందూర్ కోరకుందని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) ఎంపీ రామశంకర్ రాజ్‌భర్ పేర్కొన్నారు. ఆ దాడికి కారణమైన ఉగ్రవాదులను రోస్ట్ చేయాలని దేశ ప్రజలు కోరుకున్నట్టు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆశించలేదని.. ప్రభుత్వం సరైన రీతిలో చర్యలు తీసుకునేందుకు విఫలమయిందన్నారు. 3 రోజుల్లో చేపట్టాల్సిన మిషన్‌కు 17 రోజుల ఆలస్యం ఎందుకయిందో చెప్పాలని ప్రశ్నించారు.