calender_icon.png 4 July, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సానుకూల దృక్పథంతో ఆలోచించాలి

04-07-2025 12:00:00 AM

మైండ్ కేర్ సెంటర్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ పిలుపు 

రాజన్న సిరిసిల్ల: జూన్ 3 (విజయక్రాంతి ) మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల జిల్లా వైద్య ఆరోగ్య వైద్య శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు మానసిక ఆరోగ్యంపై గ్రూప్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో న్యూరో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ హాజరై కార్మికులకు కౌన్సిలింగ్, చికిత్స పద్దతులను గురించి వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాటడుతూ సమస్యలు ఎదురైనప్పుడు సానుకూల దృక్పథంతో ఆలోచించాలి అని అన్నారు.ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలుపుతూ సమ స్యపై కాకుండా వాటి పరిష్కార మార్గాలపై దృష్టి నిలపాలని అన్నారు.మద్యపాన వ్యసనం గురిం చి మాటాడుతూ దీనిపై కార్మికుల్లో అనేక అపోహలు ఉన్నాయని అన్నారు.

ప్రభుత్వ వైద్యశాలలో తనను సంప్రదిస్తే వైద్యం అందించి మద్యపాన వ్యసనం నుండి విముక్తి కల్పిస్తామని తెలి పారు.తంబాకు నమలడం, బీడీ, సిగరెట్ త్రాగడం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు వస్తాయని తెలిపారు.చెడు అలవాట్ల వల్ల గుండె, ఛాతీలో మంట, అల్సర్స్, కాలేయం దెబ్బతినడం, మెదడు, నరాలు దెబ్బతిని మానసిక, శారీరక అనారోగ్యం ఏర్పడుతుందని అన్నారు.

సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికుల్లో ఎక్కువగా నిద్ర సమస్యలు ఉన్నాయని తెలుపుతూ వాటిని పరిష్కరించేందుకు మందులు, కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో తమను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ , సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ, బుర్ల శ్రీమతి కార్మికులు పాల్గొన్నారు.