calender_icon.png 4 July, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందిసాగు రైతులకు సర్కార్ ప్రోత్సాహం

04-07-2025 12:00:00 AM

మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్, జూలై 3 (విజయ క్రాంతి): కంది సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. గురువారం గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచిత కంది విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ కంది సాగు ప్రోత్సహించేందుకు రైతులకు ప్రభుత్వం ఉచితంగా కంది విత్తనాలు సరఫరా చేస్తున్నదని చెప్పారు. హైదరాబాద్లో కొత్తగా ఆవిష్కరించిన కంది వంగడం దేశ పప్పుదినుసుల రంగంలో మార్పులకు శ్రీకారం చుడుతుందన్నారు. కొత్తరకం కంది సాగుతో పంట దిగుబడులు పెరుగుతాయని, తద్వారా రైతులకు అధిక రాబడి వస్తుందని చెప్పారు.

ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి ల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా అదనపు సంచాలకుడు శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి కిర్మణయి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మాతంగి అనిల్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.