calender_icon.png 4 July, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొంది గూడెంలో మెడికల్ క్యాంపు

03-07-2025 11:27:48 PM

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి..

ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి..

డాక్టర్ యమున..

మంగపేట (విజయక్రాంతి): చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనీ నరసింహ సాగర్, గొంది గూడెం గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని చుంచుపల్లి పీహెచ్సీ వైద్యురాలు యమున(Dr. Yamuna) తెలిపారు, గ్రామ ప్రజలందరికీ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల సీజనల్ గురించి, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఇంటి చుట్టూ చెత్త గాని, అలాగే నీటిని నిల్వ ఉంచకుండా చూడాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్(ఎంసిహెచ్ మొబైల్ టీం మంగపేట), పద్మ హెచ్ వి, సారమ్మ ఏ ఎన్ ఎం, అమరావతి స్టాఫ్ నర్స్, ఆశలు పాల్గొన్నారు. మొత్తం ఓపి-77 జ్వరం కేసులు-11 (మలేరియా మరియు డెంగ్యూ నెగిటివ్) నమోదయ్యాయని తెలిపారు.