11 May, 2026 | 8:41 AM

ఒకే ఓవర్‌లో 39 పరుగులు

21-08-2024 12:20 AM

టీ20లో సంచలనం

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ ఆసియా రీజనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. సమోవా బ్యాటర్  డారియస్ విస్సెర్ ఒకే ఓవర్‌లో 39 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం సమోవా, వనువాటు మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా నిలిన్ నిపికో బౌలింగ్‌లో విస్సెర్ ఈ ఘనత సాధించాడు. నిలిన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో విస్సెర్ ఆరు సిక్సర్లు బాదినా అవి వరుసగా మాత్రం కొట్టలేదు. (6, 6, 6, నోబాల్, 6, 0, నో బాల్, నో బాల్+6, 6) మొత్తంగా 39 పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో విస్సెర్ 62 బంతుల్లో 14 సిక్సలు, 5 ఫోర్ల సాయంతో 132 పరుగులు సాధించాడు.

విస్సెర్ సెంచరీతో మెరిసినప్పటికీ సమోవా జట్టు కేవలం 10 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విస్సెర్ యువరాజ్ రికార్డు సహా పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఒక్క ఓవర్‌లో 39 పరుగులు రావడం ఇదే తొలిసారి. గతంలో టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 36 పరుగులు సమర్పించుకున్న సందర్భాలు ఐదు మాత్రమే. యువరాజ్ (2007లో) బ్రాడ్ బౌలింగ్‌లో, పొలార్డ్ (2021లో) అకిల ధనుంజయ బౌలింగ్‌లో, రోహిత్ శర్మ సింగ్ కలిసి (2024లో) కరీమ్ జనత్ బౌలింగ్‌లో, నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ (2024లో) ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో, 2024 టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా బౌలింగ్‌లో పూరన్ 36 పరుగులు బాదాడు.