7 May, 2026 | 4:07 AM

తిరుపతన్న బెయిల్ పిటిషన్ 18కి వాయిదా

28-11-2024 01:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి) :  ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ, రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.  తిరుపతన్న బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయస్థానం పిటిషన్‌ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.