ఇది భూసార పరీక్ష కేంద్రమే!
15-06-2024 01:39 AM
భోపాల్, జూన్ 14: దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ పదేండ్ల క్రితమే హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో భూసార పరీక్షల కోసం శివరాజ్‌సింగ్‌చౌహాన్ సీఎంగా ఉన్నప్పుడు భారీ ఎత్తున ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పు డు ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పదవి చేపట్టారు. ఈ ఫొటో లో కనిపిస్తున్నది. 2015లో నిర్మించిన భూసార పరీక్షల కేంద్రం. దీన్ని ప్రయోగశాల అని ఎవరైనా అనుకొంటారా? రైతుల పరిస్థితే కాదు.. వ్యవసాయం కూడా ఇప్పుడు ఇలాగే తయారైందని ఈ ఫొటోను చూసిన ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.






