13-12-2025 01:28:44 AM
యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండో చిత్రం ‘మోగ్లీ 2025’తో అలరించబోతున్నారు. సందీప్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 13న రిలీజ్ కానున్న ఈ చిత్ర విశేషాలను కథానాయకుడు రోషన్ కనకాల విలేకరులతో పంచుకున్నారు.
‘మోగ్లీ’ స్వచ్ఛమైన, బలమైన ప్రేమకథ. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ సందీప్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. మోగ్లీ తన ప్రేమ కోసం దేనికైనా సిద్ధంగా ఉంటాడు. తన ప్రేమకు వచ్చిన అడ్డంకేంటి? క్రిస్టఫర్ నోలన్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేదాన్ని బట్టి ఈ కథ ముందుకు వెళుతుంది. మోగ్లీ అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్.
వాస్తవంగా ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో షూటింగ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే నేను అన్ని ఎంజాయ్ చేస్తూ, పనిని ప్రేమించి చేశాను. దీంతో అంతా సరదాగా గడిచింది. 60% షూటింగ్ అడవిలోనే చేశాం. సినిమాలో అన్ని రియల్ లొకేషన్స్ ఉంటాయి.
నటనపరంగా నాన్నకు, నాకు ఎప్పుడూ ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అమ్మతో కూడా మాట్లాడుతూ ఉంటా. ఇలాంటి చర్చ ఎప్పుడు ఉండాలని కోరుకుంటా. వాళ్లు కూడా నాకు అవసరమైన సలహాలు ఇస్తూనే ఉంటారు. ఈ సినిమాకీ కొన్ని సలహాలు ఇచ్చారు. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి.
చిన్నప్పుడే సినిమా వాతావరణంలో ఉండడంతో సినిమా మీద నాకు ఒక ప్రేమ ఏర్పడిపోయింది. ఈ విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తున్నా. ఒక్కొక్కటి నేర్చుకుంటున్నా.
హీరోయిన్ సాక్షి చాలా మంచి నటి. సినిమా కోసం సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ పండితేనే కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాంటి కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది.
సినిమాలో -ప్రీ ఇంటర్వెల్ దగ్గర హార్స్ రైడ్ సీక్వెన్స్ ఉంది. అది ఎమోషనల్ సీక్వెన్స్. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను ఆ ప్రాసెస్‌ని చాలా ఎంజాయ్ చేశా. ఒక యానిమల్ గురించి తెలుసుకోవడం అనేది సర్‌ప్రైజింగ్ ప్రాసెస్. నేను యాక్ట్ చేస్తుంటే అది కూడా యాక్ట్ చేస్తుంది. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
కొత్తగా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రీ ప్రొడక్షన్ నడుస్తోంది. ఇది ఇంటెన్స్ లవ్ స్టోరీ. మరో ప్రాజెక్టు రొమాంటిక్ కామెడీ. త్వరలోనే ఆ సినిమాల వివరాలను తెలియజేస్తాం.