30 August, 2026 | 8:58 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

నా డైట్ సీక్రెట్ ఇదే!

04-05-2025 12:05 AM

బరువు తగ్గాలంటే.. జిమ్‌కు కచ్చితంగా వెళ్లాల్సిందే, ఉపవాసాలు చేయాల్సిందే అంటుంటారు చాలామంది.. కాని అవేవి లేకుండా రోజువారీ జీవన శైలిలో ఆహారపు అలవాట్లతో బరువును నియంత్రించ వచ్చని చెబుతున్నది నటి జ్యోతిక. మూడు నెలల్లో తొమ్మిది కిలోల బరువు తగ్గి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆమె హెల్త్ సక్సెస్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం..  

‘బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువును నియంత్రించడం ఎప్పుడూ కష్టంగానే అనిపించేది’ అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు.

అని కూడా స్పష్టం చేశారు. అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్. 

ఆమే స్ఫూర్తి..

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కాని అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ.. ఆమె మాత్రం స్పందించలేదు.

అయితే గత సంవత్సరం 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్‌కి వెళ్లకుండానే అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘డైట్ బట్.. నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీన్ని జ్యోతిక కూడా అనుసరించారు. 

వారికి ధన్యావాదాలు.. 

ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులచే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్‌నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా మూడు నుంచి తొమ్మిది నెలల్లో తొమ్మిది కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

దానితో పాటు ‘అమురా.. కేవలం మూడు నెలల్లో తొమ్మిది కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు.. అమురా.. మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్య్యూలో తన బృందానికి, విద్యాబాలన్‌కు కృతజ్ఞాతలు తెలిపింది.