నూతన చట్టాలపై అవగాహన సదస్సు
కిమ్స్ లా కళాశాలలో నిర్వహణ
కరీంనగర్, ఏప్రిల్ 4(విజయక్రాంతి): స్థానిక కిమ్స్ ‘లా’ కళాశాలలో జరిగిన నూతన చట్టాలు అమలు తీరు తెన్నుల గురించి సీనియర్ అడ్వకేట్ మధుసూదన్‌రావు బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్(సీఆర్‌పీసీ) వివరించారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) 2023 ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో వచ్చిందని విద్యార్థులకు తెలియజేశారు. భారతదేశంలో 1 జూలై 2024 నుంచి బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్, బీఎస్‌ఏ అమలులోకి వచ్చాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మరోక వక్త కె.శ్రీనివాస్ బీఎస్‌ఏ(ఎవిడెన్స్ ఆక్ట్) మాట్లాడుతూ భారతీయ సాక్ష్యా అధినియం(బీఎస్‌ఏ) 2023, ఇండియన్ ఆక్ట్ స్థానంలో వచ్చిందని తెలియజేశారు. వీరిరువురూ వక్తలు కిమ్స్ లా కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు వక్తలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్‌కుమార్, ఫ్యాకల్టీ వెంకటస్వామి, కొమురయ్య, కిషన్, వంశీ, కీర్తీ, ఏఓ రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.




