01-06-2025 12:00:00 AM
కోపానికి, ఆకలికి మధ్య సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని సదర్భాల్లో ఆకలిగా ఉన్నప్పు డు కోపంతో ఇతరులపై అరుస్తారు. మెదడు చురుకుగా పనిచేయానికి శరీరానికి తగినంత శక్తి అవసరం. మెదడుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు అందకపోతే.. కోపం, విసు గు, చికాకు పడతారని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువసేపు ఆకలితో ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో శరీరం గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది.
ఒత్తిడి హార్మోన్లు విడుదలైనప్పుడు చాలా కోపం, చిరాకు పడుతుంటారు. ఈ హార్మో న్లు మనస్సును నేరుగా ప్రభావితం చేస్తాయి. దీని నుంచి అన్ని రకాల భావోద్వేగాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు వెంటనే భోజనం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు.