03-05-2025 08:31:15 PM
ఏఐటియుసి కామారెడ్డి జిల్లా కార్యదర్శి బాలరాజు...
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెను చేపట్టనున్నట్లు కామారెడ్డి జిల్లా పరిపాలన అధికారి నసీర్ అహ్మద్ మసూర్ కు శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి. బాలరాజు మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కార్మికుల 29 చట్టాలను నాలుగు కోడ్ లుగా తీసుకురావడం జరుగుతుందని కార్మికుల హక్కులను కాలా రాస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా ఎనిమిది గంటల నుండి 12 గంటల వరకు కార్మికులకు పని పెంచడం జరిగిందని, కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26 వేల జీతం ఇవ్వాలని ఆయన అన్నారు.
అదేవిధంగా మోడీ ప్రభుత్వం 16 లక్షల 35 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు మాఫీ చేసిన చరిత్ర నరేంద్ర మోడీ దని, కేంద్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా కనీస వేతనాలు ఇవ్వకుండా, కార్మికులను కాంట్రాక్టు విధానంతో శ్రమ దోపిడి గురి చేస్తున్నారని అన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పప్పులు, పెట్రోల్, గ్యాస్ డీజిల్ ,పెంచిన కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సామాన్యులు బతికి పరిస్థితులు లేవని ఆయన అన్నారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేక అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోలేవని, రైతుల సమస్యలు పరిష్కరించకుండా, నకలి విత్తనాలు నకిలీ మందులు అరికట్టాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అసంఘటి రంగ హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రైవేటీపరంలో ఉన్న ఎల్ఐసి, బ్యాంకు , విద్య, రైల్వే, ఆర్టీసీ రంగాలను ప్రైవేటు చేసేందుకు అంబానీ ,ఆదాని లాంటి పెట్టుబడిదారుల నుండి విముక్తి చేయాలని అన్నారు, 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారి రాజేందర్, సివిల్ సప్లై హమాలీల, మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి.పీ. బాల్రాజ్ ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు. ఎల్ దశరథ్. సివిల్ సప్లై హమాలీ నాయకులు జిల్లా నాయకులు ఎం కృష్ణ, సాయిలు తెలంగాణ రైతు సంఘ జిల్లా కన్వీనర్ ఎం దేవయ్య, ఎం ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.