calender_icon.png 18 January, 2026 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమికను తల్లి పాత్రలో చూడలేను, కానీ..

18-01-2026 12:04:56 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించిన తాజాచిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్ మేడ్ ఫిలమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మిస్తున్నారు. నేటి యూత్‌కు, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్ వంటి సుపరిచిత తారాగణం ఇందులో భాగమైంది. రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవిప్రకాశ్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటివారు ముఖ్యపాత్రల్ని పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. “మా అమ్మాయి నీలిమా ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి గురికాదు. కానీ, ఇప్పుడు ట్రైలర్ చూసి ఎమోషన్ అయిందంటే.. ఈ కథ ఆమెను అంతగా ప్రభావితం చేసింది. మా కుటుంబం మొత్తం ఈ స్టోరీకి కనెక్ట్ అయింది. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఈ కథలో అడాల్‌సెన్స్ చాలా కీలకం. అందుకే టీనేజర్స్‌ను తీసు కున్నాం. ముఖ్యంగా సారా అర్జున్ ఉంటేనే ఈ సినిమా చేద్దామని నీలిమ అంది. కథ చెప్పగానే సారా తండ్రి రాజ్ అర్జున్ షాక్ అయ్యారు. భూమికను తల్లి పాత్రలో చూడడం నాకు నచ్చదు.

కానీ యంగ్ మదర్ కావాలని నీలిమ చెప్పడంతో ఆమెకు కథ చెప్పాం. ఆమె పూర్తి స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పింది. తద్వారా గ్లామర్ పాత్రలకే ఓకే చెప్పే హీరోయిన్లకు భూమిక కనువిప్పు కలిగించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు కథ చెప్పగానే ఓకే అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవను అనుకున్నప్పుడు స్క్రిప్ట్ పంపిస్తే.. కీరవాణి నుంచి ఫోన్ వచ్చింది. ఇది చాలా అత్యవసరంగా తీయాల్సిన సినిమా అని చెప్పారు. కాలభైరవ.. తండ్రిని మించిన తనయుడు అనిపించేలా మ్యూజిక్ ఇచ్చాడు. 2026 చాలా నవ్వులతో ప్రారంభమైంది. అందుకే వచ్చే నెల ఫిబ్రవరి 6న ఒక ప్రత్యేక సందర్భం కోసం మా సినిమాను తీసుకొస్తున్నాం. ఇది అందరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం” అని చెప్పారు.

భూమిక మాట్లాడుతూ.. “యుఫోరియా నాకు చాలా స్పెషల్ జర్నీ. 23 ఏళ్ల తర్వాత గుణశేఖర్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్‌లోనే స్పెషల్ సినిమా అవుతుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు నా కొడుకు గుర్తొచ్చాడు. పిల్లలను ఎలా పెంచాలనేది అందరూ తెలుసుకో వా లి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది” అన్నారు. హీరోయిన్ సారా అర్జున్ మా ట్లాడుతూ.. “చాలా రోజుల త ర్వాత తెలుగు ప్రేక్షకుల ముందు నిలబడడం ప్రత్యేకంగా ఉంది. గుణశేఖర్‌తో పని చేయడం గౌరవంగా భావిస్తున్నా.

అద్భుతమైన ఈ సినిమా కోసం వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఎంతో కష్టపడి పనిచేశారు. ఇది తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుంది” అని తెలిపారు. ‘ఇంత ఇంపాక్ట్ ఉన్న సినిమాను తీసినందుకు చాలా ఆ నందంగా ఉంద’ని నిర్మాత నీలిమ గుణ చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు అడ్డాల పృథ్వీరాజ్, విఘ్నేశ్ గవిరెడ్డి, చిత్రబృందం పాల్గొన్నారు.