19-01-2026 12:47:21 AM
జవహర్‌నగర్, జనవరి 18 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జవహర్ నగర్ బీసీల ఐక్యవేదిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం ఆ సంఘ అధ్యక్షుడు మారోజు సోమాచారి అధ్యక్షతన బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కుల సంఘాల చైర్మన్ కుందారం గణేష్‌చారి ఆవిష్కరించారు. అనంతరం జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌లో ఉన్న రెండు డివిజన్లను బీసీలకే కేటా యించాలని, కేటాయించకపోతే ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటిస్తామని హెచ్చరించారు.
కుందారం గణేష్‌చారి మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌లో కనివిని ఎరుగని రీతిలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జవహ ర్‌నగర్ తొలి మేయర్ మేకల కావ్య, బీసీ ఐక్యవేదిక గౌరవ సలహాదారులు, మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్, గౌరవ సలహాదారులు తాటికొండ శ్రీరాములుచారి, రంగుల శంక ర్, కారింగుల రాజుగౌడ్, కొండల్ ముదిరాజ్, పిన్నోజు సుధాకర్ చారి తదితరులు పాల్గొన్నారు.