1 July, 2026 | 10:08 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మనకు 16, ఏపీకి 10 టీఎంసీలు

13-05-2026 12:46 AM

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి) : కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం జరిగిన సమావేశంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై కేఆర్‌ఎంబీ అధికారులు చర్చించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

శ్రీశైలం,నాగార్జునసాగర్ నుంచి తెలంగాణకు 16 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల కేటాయింపులకు కమిటీ ఆమోదం తెలిపింది. శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం అధిక మొత్తం లో నీటిని తరలిస్తోందని తెలంగాణ అధికారులు కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి  5, సాగర్ నుంచి 13 టీఎంసీలు  కలిపి 18 టీఎంసీలు కేటాయించాలని మే 2న కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాశారు.

అలాగే ఏపీ కూడా నాగార్జునసాగర్ నుంచి  మే 31వ తేదీ వరకు 10 టీఎంసీలు కేటాయించాలని ఏప్రిల్ 29న కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కృష్ణా బోర్డు ౨౧వ సర్వసభ్య సమావేశం ఈ నెల 14న  హైదరాబాద్‌లో సమావేశం కానుంది. బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.