11 August, 2026 | 2:50 AM

సేవా కార్యక్రమాలతో తోట మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

11-08-2026 12:35 AM

నాగోల్, ఆగస్టు 10 (విజయక్రాంతి): చైతన్యపురి డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసం వద్ద మెగా హెల్త్ క్యాంపు, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు బీపీ, షుగర్, కిడ్నీ, ఆర్థోపెడిక్, నేత్ర పరీక్షలు ఉచితంగా నిర్వహించగా, అవసరమైన వారికి రాయితీ ధరకు కళ్లద్దాలు అందజేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ఈ సందర్భంగా తోట మహేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సేవే తన లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్ రెడ్డి, సాగర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివ ప్రకాష్, కొసం సత్యనారాయణ, జక్కిడి మల్లారెడ్డి, తూర్పాటి చిరంజీవి, తోట శ్రీనివాస్ యాదవ్, లింగల రాహుల్ గౌడ్, చెనగోని రవీందర్ గౌడ్, నిఖిల్ గౌడ్, లక్కీ గౌడ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, పోచబోయిన సురేష్ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.