కేరళలో 1000 కోట్లు
మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘1000 కోటు’్ల. గతంలో ‘100 కోట్లు’ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం ‘1000 కోటు’్ల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కేరళలో డబ్బింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ “మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 కోట్లు పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అని తెలిపారు.






