calender_icon.png 17 October, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీడియా ముసుగులో బెదిరింపులు..

17-10-2025 12:38:13 AM

ఇద్దరు రిపోర్టర్లపై కేసు నమోదు

వేములవాడ, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఈ సందర్భంగా వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ...వేములవాడ పట్టణం అగ్రహారం గ్రామానికి చెందిన బొమ్మేల మహిపాల్ అనే వ్యక్తి వృత్తి పరంగా ఒగ్గు కళాకారుడు. గంగాదేవిని పూజిస్తూ,సపుడలమ్మ పూజలు చేస్తూ,మూలికల వైద్యం ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు.

వేములవాడ పట్టణానికి చెందిన తొగరి కరుణాకర్ అనే వ్యక్తి జర్నలిస్ట్ ముసుగులో తేదీ 11- రోజున మహిపాల్‌కు ఫోన్ చేసి నువ్వు వేములవాడకు రావాలని రాకపోతే నీపై సి.సి.ఎస్. పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని బెదిరించాగా మహిపాల్ వేములవాడకు వచ్చి కరుణాకర్ను కలుసుకోని ఏ విషయం పై నాపై పిర్యా దు చేస్తావ్ అని కరుణాకర్ ని అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పడమే కాకుండా నీ గురించి నీ భార్య పిల్లల గురించి మా పేపర్‌లో రాస్తా అని బెదిరించాడు.

మరుసటి రోజు కరుణాకర్ మరోసారి ఫోన్ చేసి, నువ్వు ఒకరిని మోసం చేశావని మా పేపర్లో రాయమని వాళ్ళు వచ్చి చెప్పారని, రాయకుండా ఉండాలంటే నాకు, నా పేపర్లో క్రైమ్ రిపోర్టర్గా ఉన్న రాజుకి 30,000/- రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భయభ్రాంతులకు గురైన మహిపాల్ 14- సాయంత్రం 6:46 గంటలకు ఫోన్పే ద్వారా రూ.10,000/- చెల్లించాడు. అయినప్పటికీ వారు మరిన్ని రూ.20,000/- ఇవ్వాలని మళ్లీ బెదిరించారు.

ఈసంఘటనపై బాధితుడు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కరుణాకర్, రాజు అనే ఇద్దరిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి తోగరి కరుణాకర్ ను రిమాండ్ కు తరలించడం జరిగింది. రాజు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కరుణాకర్ రాజులకు సంబంధించిన బాధితులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని, మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.