17-10-2025 12:37:55 AM
ముషీరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల18 న జరిగే రాష్ట్ర బంద్ విజ యవంతం చేయాలని కోరుతూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విట్టల్ వాడి చౌర స్తా నుండి నారాయణ గూడ వరకు గురువారం రాత్రి కాగడాల ప్రదర్శనతో బారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కాగడాల ర్యాలీలో పాల్గొన్న బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈనెల 18న జరిగే బీసీ రాష్ట్ర బంద్ ను అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవం తం చేయాలని కోరారు. బందును శాంతియుతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.