కొకెయిన్, గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
శంకర్‌పల్లి, మార్చి 30 (విజయక్రాంతి): మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహాస్ ఫౌండేషన్ సమీపంలో ఇంద్రారెడ్డి నగర్ రోడ్డు పై కోకైన్, గాంజా తరలిస్తున్న ముగ్గురిని మోకిల,ఎస్‌ఓటి పోలీసులు అదుపు లోకి తీసుకున్న సంఘటన ఈనెల 29వ తేదీన జరిగింది. మోకిలా సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహ ఫౌండేషన్ సమీపంలో ఇంద్రా రెడ్డి నగర్ రోడ్డుపై స్విఫ్ట్ కారులో ముగ్గురు వ్యక్తులు కో కైన్, గాంజా తరలిస్తుండగా మోకిలా, ఎస్‌ఓటి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారని తెలిపారు.
ముగ్గురు నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏ1 పొన్నాల సిద్ధార్థ, ఏ2 చాలా వాడి హేమంత్ కృష్ణవంశీ, ఏ3 అవధూత విష్ణు తేజ మీరు ముగ్గురు కలిసి మాదకద్రవ్యాలను తరలిస్తున్నారని చెప్పారు. పొన్నాల సిద్ధార్థ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారని తెలిపారు.
వీరి వద్ద నుండి 39: 79 గ్రాముల కొకైన్, సుమారు 2-3 గ్రాముల గాంజా( కన్నబీస్) నాలుగు సెల్ ఫోన్ లు, మారుతి కారును స్వాధీనం ఉన్నావని చెప్పారు. ఏ1 సరఫరా చేసేవాడని, ఏ2 మధ్యవర్తిగా వ్యవహరించేవాడని, ఏ3 వినియోగదారుడని తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని సిఐ తెలిపారు. గోవా నుండి మాదకద్రవ్యాలను హైదరాబాద్ లో వీరు విక్రయిస్తున్నారని చెప్పారు.




