నిర్వాసితులకు మరో రూ.150 కోట్లు మంజూరు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, మార్చి 30: ఉదండాపూర్ ప్రాజె క్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ప్రభుత్వం మరో రూ.150 కోట్లను వి డుదల చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద విడుదల చేసిన మొత్తం రూ. 400 కోట్లకు చేరిందని తెలిపారు.
ఉదండాపూర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన మిగిలిన బకాయి మొత్తాన్ని ఏప్రిల్ నెలలో ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి కృషి చేస్తానని హా మీ ఇచ్చారు. హైదరాబాద్ లోని జలసౌద లో ఈనెల 8న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై జరిగిన అధికారిక సమీక్షా సమావేశం లో ఉదండాపూర్ నిర్వాసితులకు చె ల్లించాల్సిన బకాయిల విషయంలో చర్చించి న విషయాన్ని సోమవారం ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు.
ఆర్ అండ్ ఆర్ ప్యా కేజీ లో భాగంగా ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని రూ.18 లక్షలకు పెం చడం, ఈ కారణంగా నిర్వాసితులకు అదనంగా రూ.146 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం గతంలోనే అంగీకరించిందని, పెంచిన ఈ పరిహారం తో కలిసి ప్రస్తుతం ఉదండాపూర్ నిర్వాసితులకు ఇంకా రూ.338 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు.
ఈ మొత్తాన్ని రెండు నెలల్లో నిర్వాసితులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ కూడా ఇచ్చారని తెలిపారు. రెండు నెలల్లోపుగా ఉదండాపూర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే మార్చి నెలలో విడుదల చేయాల్సిన రూ.150 కోట్లను ప్రస్తుతం విడుదల చేసిందని వెల్లడించారు. నిర్వాసితులకు చెల్లించా ల్సిన మిగిలిన బకాయి మొత్తాన్ని కూడా ఏప్రిల్ నెలలో తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారంగా విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్కలకు అనిరుధ్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్క రుపాయి కూడా చెల్లించకుండా నిర్వాసితులను రోడ్లపాలు చేసారని విమర్శించారు. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన ఏడాది కాలంలోనే ఇప్పటి వరకూ రూ.250 కోట్లను విడుదల చేసారని, ప్రస్తుతం విడుదల చేసిన రూ.150 కోట్లతో కలిపి ఈ మొత్తం ఇప్పుడు రూ.400 కోట్లకు చేరిందని అనిరుధ్ రెడ్డి వివరించారు.




