4 July, 2026 | 8:02 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •   కొద్దిపాటి వర్షాలకే కూలిన ఇల్లు   •   ఎస్ఆర్పీ 3 గనిని సందర్శించిన జీఎం   •   తెలంగాణ సాయుధ పోరాట వీరుడు ‘దొడ్డి కొమురయ్య’: కలెక్టర్ కుమార్ దీపక్   •   ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   అంతక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి   •   రక్తదానమే ప్రాణదానం.. యువత సేవాభావంతో ముందుకు రావాలి: ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర   •  

చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి

05-10-2024 12:29 AM

మేడ్చల్ జిల్లా కొల్తూరులో విషాదం

మేడ్చల్, అక్టోబర్ 4: చెరువులో మునిగి ముగ్గురు బాలురు మృతిచెందిన విషాదకర ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్తూ రు గ్రామానికి చెందిన బాలేకర్ సాయి హర్ష (10), సిలేంద్రి హర్షవర్ధన్ (10), ఇరబోయిన మనోజ్ (11) అనే ముగ్గురు బాలురు దసరా సెలవులు కావడంతో ఊర చెరువు వద్ద ఆడుకోవడానికి వెళ్లారు. వారిలో ఒక బాలుడు చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. మిగతా ఇద్దరు అతడిని కాపాడడానికి ప్రయత్నించి వారు సైతం నీట మునిగారు. బాలుర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీవో న్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.