4 July, 2026 | 8:38 PM

రక్తదానమే ప్రాణదానం.. యువత సేవాభావంతో ముందుకు రావాలి: ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

04-07-2026 07:33 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అత్యున్నత మానవతా సేవ అని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

థలసేమియా బాధితులు, ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రతి యూనిట్ రక్తం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. శిబిరంలో 60 మంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. యువత డ్రగ్స్, గంజాయి, మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత పాటించాలని సూచించారు.

కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సీఐ నరేష్, ఎస్‌ఐ డి. ఆంజనేయులు, సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ కుమార్ గౌడ్, వైద్యాధికారి డా. హేమీమా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. అంజయ్య, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.